-
అనంతలో అవంతిక
అనంతపురం కల్చరల్ : అనంతపురంలో ప్రముఖ సినీనటి తమన్న సందడి చేసింది. మలబార్ గోల్డ్, డైమండ్స్ షోరూమ్‌ను ప్రారంభించడానికి గురువారం నగరానికి విచ్చేసిన తమన్నాను చూడటానికి అభిమానులు భారీగా తరలిరావడంతో సప్తగిరి సర్కిల్ కిటకిటలాడింది. మలబార్ షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత తమన్నా మాట్లాడుతూ నాణ్యమైన ఆభరణాలతో, స్వచ్ఛమైన బంగారంతో మలబార్ వారు ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం తాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో నటిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టించిన ‘బాహుబలి’ వంటి తెలుగు సినిమాలో నటించడం గర్వంగా ఉందని చెప్పారు. నిర్వాహకులు మాట్లాడుతూ 178వ షోరూమ్‌ను అనంతలో ప్రారంభిస్తున్నామని, తొలిసారి పూర్తీస్థాయి హాల్‌మార్క్ బంగారంతో పాటు ప్లాటినమ్, డైమండ్స్ ఆభరణాలను జిల్లాకు పరిచయం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ స్వరూపతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూముల నిర్వాహకులు హాజరయ్యారు. -
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని...
అనంతపురం సెంట్రల్ : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి కావడంతో మనస్తాపానికి గురైన ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం రామకృష్ణ కాలనీలో ఆదివారం జరిగింది. వన్‌టౌన్ సీఐ రాఘవన్ కథనం మేరకు... కాలనీకి చెందిన శివకృష్ణ(24) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి లేరు. తల్లి లక్ష్మీ కువైట్‌లో ఉంటున్నారు. దీంతో అతనొక్కడే రామకృష్ణ కాలనీలో ఉంటూ కూలీ పనులకు వెళ్లేవాడు. బంధువులకు చెందిన ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. అయితే ఆమె తల్లిదండ్రులు మరో యువకుడికిచ్చి పెళ్లి చేయడంతో తట్టుకోలేకపోయాడు. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి తనువు చాలించాడు. చుట్టుపక్కల వారు గమనించి కువైట్‌లో ఉంటున్న అతని తల్లికి ఫోన్లో సమాచారం తెలిపారు. పోలీసుల దృష్టికీ తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వేసవి తాపం.. తాటిముంజలతో శాంతం
నిప్పుల కొలిమి పక్కనే ఉన్నట్లు భగభగ మంటున్న ఎండ వేడిమి నుంచి తాటిముంజలు ఉపశమనమిస్తున్నాయని అంటున్నారు ఈ యువకులు. కళాశాలకు సెలవులు కావడంతో ఆత్మకూరులోని కొందరు యువకులు గ్రామ సమీపంలోని తాటితోపులోకి చేరుకుని తాటి ముంజలుతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. - ఆత్మకూరు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement