హైదరాబాద్ : అమీర్‌పేటలో (Ameerpet Fire Accident) గురువారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదం స్థానికులను కలవరానికి గురిచేసింది. ప్రధాన రహదారిపై వెళ్లేవారిని బెంబేలెత్తించింది. దట్టమైన పొగలు, ఎగిసిపడిన మంటలు ఉలికిపాటు గురి చేశాయి. చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం 2.30 గంటలకు మంటలను అదుపులోకి తేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


