సుమన్ , ఆమని ప్రధాన పాత్రల్లో, రాజేష్ భూపతి హీరోగా, స్వప్నరాజ్, అబిత హీరోయిన్లుగా ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ సినిమా ఆరంభమైంది.
రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకత్వంలో బి.వి.సి ఫిల్మ్స్‌పై బీఎన్ ఆర్ చౌదరి నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుత్తా క్లాప్ ఇచ్చారు.


