
తెలుగు సినిమా దిగ్గజం, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఆయన శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.


































