ప్రత్యేకంగా తయారు చేసిన మంచు మనోజ్- ప్రణతిరెడ్డి వివాహ శుభలేఖ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది
వివాహ మహోత్సవం గొప్పతనాన్ని తెలిపేలా కార్డు డిజైన్ చేశారు
కాషాయ, ఊదారంగు కాంబినేషన్ లో కళంకారి తరహా బొమ్మలతో రూపొందించిన శుభలేఖ ఆకర్షణీయంగా ఉంది
ముఖ్యంగా వెడ్డింగ్ కార్డులోని బొమ్మలు కనువిందు చేస్తున్నాయి.
శ్రీకాళహస్తికి చెందిన రమేశ్ గోర్జల అనే కళాకారుడు ఈ బొమ్మలు వేశాడు.
స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ శుభలేఖ ప్రధాని నరేంద్ర మోదీని ఆకట్టుకుంది
మోహన్ కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లి స్వయంగా శుభలేఖను మోదీకి అందజేసి, పెళ్లికి ఆహ్వానించారు
తనకు ఇలాంటి కార్డు కావాలని మోదీ స్వయంగా అడిగారని మనోజ్ చెప్పారు
మనోజ్- ప్రణతిరెడ్డి వివాహం మే 20న ఉదయం 9.10 గంటలకు హైటెక్స్ లో జరగనుంది
మనోజ్- ప్రణతిరెడ్డి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు
స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ శుభలేఖ ప్రధాని నరేంద్ర మోదీని ఆకట్టుకుంది


