'మేం దగ్గరే.. కానీ చరిత్ర దూరం చేసింది' | Sakshi
Sakshi News home page

'మేం దగ్గరే.. కానీ చరిత్ర దూరం చేసింది'

Published Fri, Aug 28 2015 7:22 PM

'మేం దగ్గరే.. కానీ చరిత్ర దూరం చేసింది' - Sakshi

ముంబయి: 'మేం భౌగోళికంగా చాలా దగ్గర.. కానీ చరిత్ర మాత్రం మమ్మల్ని చాలా దూరం చేసింది' అంటూ పాకిస్థాన్కు చెందిన మహిళ తన భారతీయ స్నేహితురాలికి సంబంధించి చెప్పింది. హ్యూమన్స్ ఆఫ్ బొంబే ఫేస్బుక్ ద్వారా ఆమె ఈ వివరాలు తెలిపింది. ముంబయికి చెందిన యువతితో పరిచయం పెంచుకున్న ఆమె పన్నెండేళ్ల తర్వాత తన స్నేహితురాలిని కలుసుకుంది. స్వయంగా తన స్నేహితురాలును కలుసుకునేందుకు ఇస్లామాబాద్ నుంచి ముంబయికి వచ్చింది.

ఈ సందర్భంగా ఆమె పేరు తెలియజేయకుండానే 2003లో ఓ స్నేహితుడి ద్వారా తాను న్యూయార్క్లో ఇండియన్ స్నేహితురాలిని సంపాధించుకున్నానని, అప్పటి నుంచి మరోసారి కలుసుకునేందుకు పన్నేండేళ్లు పట్టిందని తెలిపింది. తమ ఇంట్లోని వివాహ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండి కూడా తన భారత స్నేహితురాలికి వీసా సమస్య వల్ల కలుసుకోలేకపోయామని చెప్పింది. అందుకే ఈసారి తానే స్వయంగా వీసాకోసం దరఖాస్తు చేసుకొని నాలుగు నెలలు కష్టపడి చివరకు సాధించిందట. ఎట్టకేలకు తన స్నేహితురాలిని కలుసుకున్నానని సంతోషం వెలిబుచ్చింది. వీరిద్దరికీ క్రికెట్ చూసే పిచ్చి ఎక్కువంట. అదే వారిద్దరి స్నేహానికి కారణమని కూడా చెప్పింది.

Advertisement
Advertisement