పోలీస్ స్టేషన్ కు డిగ్గీరాజా | Vidhan Sabha recruitment scam: Digvijay Singh to appear before Bhopal Police over | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్ కు డిగ్గీరాజా

Oct 15 2015 12:51 PM | Updated on Aug 14 2018 3:55 PM

పోలీస్ స్టేషన్ కు డిగ్గీరాజా - Sakshi

పోలీస్ స్టేషన్ కు డిగ్గీరాజా

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ భోపాల్ పోలీసుల ముందు హాజరుకానున్నారు.

భోపాల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ భోపాల్ పోలీసుల ముందు హాజరుకానున్నారు. మధ్యప్రదేశ్ విధాన సభ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో భాగంగా చేపడుతున్న విచారణలో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన గురువారం పోలీసుల వద్దకు వెళుతున్నారు. జహంగిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు.

1993 నుంచి 2003 మధ్యకాలంలో ఈ కుంభకోణం చేసుకుంది. ఆ సమయంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జహంగిరాబాద్ పోలీసులు దిగ్విజయ్ సింగ్పై, నాటి స్పీకర్ శ్రీనివాస్ తివారీ, ఇతర వ్యక్తులపై విధాన సభకోసం జరిగిన రిక్రూట్ మెంట్లో మోసం, కుట్ర, నకిలీ, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement