ఏడుగురు తమిళ జాలర్లు అరెస్టు | Seven Indian fishermen arrested by Sri Lankan Navy | Sakshi
Sakshi News home page

ఏడుగురు తమిళ జాలర్లు అరెస్టు

Oct 2 2015 12:34 PM | Updated on Aug 20 2018 4:27 PM

శ్రీలంక నావికా దళ అధికారులు ఏడుగురు తమిళ జాలర్లను అరెస్టు చేశారు.

నాగపట్టినం(తమిళనాడు): శ్రీలంక నావికా దళ అధికారులు ఏడుగురు తమిళ జాలర్లను అరెస్టు చేశారు. అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించారని, అందుకే వారిని అదుపులోకి తీసుకున్నామని అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారిని జాఫ్నాకు సమీపంలోని కాంకేసంతురాయ్ వద్ద విచారిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల రోజుల్లో ప్రతిసారి తమిళ జాలర్లను తమ అదుపులోకి తీసుకోవడం లంక జాలర్లకు పరిపాటి అయింది. పట్టుకున్న ప్రతిసారి తాము కఠిన నిబంధనలు విదిస్తున్నా లెక్కచేయకుండా భారత మత్యకారులు తమ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తున్నారని శ్రీలంక చెబుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement