ఫ్లాట్ గా ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్ గా ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు

Published Tue, Feb 21 2017 9:42 AM

Sensex, Nifty open flat with positive bias; Infosys gains

సానుకూల ధోరణిలో ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. టెక్నాలజీ, హెల్త్ కేర్, మెటల్ స్టాక్స్ మద్దతుతో ప్రారంభ ట్రేడింగ్ లో నిఫ్టీ 8900 కీలకమార్కును తాకింది.  ప్రస్తుతం సెన్సెక్స్ 36.32 పాయింట్ల లాభంలో 28,697 వద్ద, నిఫ్టీ 11.35 పాయింట్ల లాభంలో 8,890 వద్ద ట్రేడవుతున్నాయి. టెక్ దిగ్గజం టీసీఎస్ షేర్ల బైబ్యాక్ ప్రకటించడంతో ఇన్ఫోసిస్ సైతం షేర్ బైబ్యాక్ ప్రకటిస్తుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఈ బైబ్యాక్ అంచనాలతో ఇన్ఫోసిస్ షేరు 1 శాతం పైకి ఎగిసింది.
 
రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీ, సన్ ఫార్మా లాభాలు ఆర్జిస్తుండగా.. లాభాల స్వీకరణ నేపథ్యంలో హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు 0.6శాతం పడిపోయింది. భారతీ  ఎయిర్ టెల్, ఐటీసీ, మారుతీ, సిప్లా, గెయిల్ నష్టాలు గడిస్తున్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడింది. మంగళవారం ట్రేడింగ్ లో 66.92 వద్ద కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 48 రూపాయల నష్టంతో 29,312 వద్ద ట్రేడవుతున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement