శ్రీరాముడిలాగే... నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు | Rajnath Singh compares Narendra Modi with Lord Rama | Sakshi
Sakshi News home page

శ్రీరాముడిలాగే... నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు

Dec 29 2013 5:23 PM | Updated on Aug 15 2018 2:14 PM

శ్రీరాముడిలాగే... నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు - Sakshi

శ్రీరాముడిలాగే... నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు

బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని శ్రీరాముడితో పోల్చారు.

బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని శ్రీరాముడితో పోల్చారు. 'రామాయణ ఇతిహాసంలో అయోధ్య రాజుగా  శ్రీరాముడి పట్టభిషేకాన్ని అడ్డుకునేందుకు మందర కుట్ర పన్నినట్టుగా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీపై అదే రీతిలో కుట్రపన్నుతోంది" అని రాజ్నాథ్ అన్నారు.

ఆదివారమిక్కడ జరిగిన బహిరంగ ర్యాలీలో రాజ్నాథ్ ప్రసంగించారు. మందర కుట్రలు చివరకు ఫలించలేదని రాముడు రాజుయ్యాడని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ కూడా అదే విధంగా ప్రధాని అవుతారని రాజ్నాథ్ పేర్కొన్నారు. మోడీపై కుట్రలు పన్నేకొద్దీ ఆయన మరింత రాటుదేలుతున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement