లాలూ కటౌట్లతో రబ్రీదేవి చట్పూజలు | Rabri Devi perform ‘Chhath puja’ without Lalu prasad yadav | Sakshi
Sakshi News home page

లాలూ కటౌట్లతో రబ్రీదేవి చట్పూజలు

Nov 9 2013 10:59 AM | Updated on Sep 2 2017 12:28 AM

లాలూ కటౌట్లతో రబ్రీదేవి చట్పూజలు

లాలూ కటౌట్లతో రబ్రీదేవి చట్పూజలు

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి - లాలూ ప్రసాద్‌ సతీమణి రబ్రీదేవీ పాట్నాలో చత్‌పూజ నిర్వహించారు. సొంత నివాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో చత్‌పూజను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చత్‌పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందని మహిళల ప్రగాఢ విశ్వాసం.

మరోవైపు బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి - లాలూ ప్రసాద్‌ సతీమణి రబ్రీదేవీ పాట్నాలో చత్‌పూజ నిర్వహించారు. సొంత నివాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పశువుల దాణా స్కామ్‌లో లాలూ ప్రసాద్‌యాదవ్‌ జైలుపాలు కాగా.. అతని ఫ్లెక్సీలను పూజా ప్రాంతంలో ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement