సినిమా చూసిన రాష్ట్రపతి | President enjoys special 'Piku' screening | Sakshi
Sakshi News home page

సినిమా చూసిన రాష్ట్రపతి

Jun 8 2015 2:54 PM | Updated on Sep 3 2017 3:26 AM

సినిమా చూసిన రాష్ట్రపతి

సినిమా చూసిన రాష్ట్రపతి

షూజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొంది, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'పికూ' సినిమాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చూశారు.

షూజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొంది, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'పికూ' సినిమాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చూశారు. ఆయన కోసం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆయనకు ఈ సినిమాతో పాటు సినిమాలో బెంగాలీ యాసలో ఉన్న హిందీ కూడా బాగా నచ్చిందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు.

తండ్రీకూతుళ్ల మధ్య ఉండే చక్కటి అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇందులో కూతురి పాత్ర పోషించిన దీపికా పడుకొనే.. తన సొంత జీవితాన్ని సైతం పక్కన పెట్టి, తండ్రి (అమితాబ్) చెప్పే కథలు వింటూ ఉంటుంది. ఇర్ఫాన్ ఖాన్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా మే 8వ తేదీన విడుదలైంది. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ కోసం ఈ సినిమాను ప్రత్యేకంగాప్రదర్శించారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement