గిన్నిస్ కెక్కిన అర కిలో కుక్క | Half a kilogramme dog enter Guinness World Record | Sakshi
Sakshi News home page

గిన్నిస్ కెక్కిన అర కిలో కుక్క

Sep 26 2013 5:27 PM | Updated on Sep 26 2018 6:32 PM

ఆ కుక్క బరువు అర కిలో. పొడవు 9.65 సెంటీ మీటర్లు. చూడటానికి పాకెట్ సైజులో ఉంటుంది. ఐతే ఇదేమీ బొమ్మ కాదు. ప్రాణమున్న కుక్కే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే.

ఆ కుక్క బరువు అర కిలో. పొడవు 9.65 సెంటీ మీటర్లు. చూడటానికి పాకెట్ సైజులో ఉంటుంది. ఐతే ఇదేమీ బొమ్మ కాదు. ప్రాణమున్న కుక్కే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే. ప్రపంచంలో అతి చిన్న కుక్కగా గిన్నిస్ బుక్ రికార్డుల కెక్కింది. ఈ ఆడకుక్క పేరు మిరాకిల్ మిల్లీ. అమెరికాలో అంతర్భంగా ఉన్న పుయెర్టో రికోలోని డొరడాకు చెందిన వానెసా సెమ్లర్ దీని యజమాని. మిల్లీ 2011 డిసెంబర్లో జన్మించింది. వయసు దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇది అర కిలోకు మించి బరువు పెరగలేదు.
 
బరువు, పరిణామంలో చిన్నగా ముద్దుగా ఉన్న ఈ కుక్క అందర్నీ అబ్బురపరుస్తోంది. తనను చూసేందుకు వచ్చినవారు ఫొటోలు తీసేటపుడు మిల్లీ చక్కగా పోజులిస్తోంది. దీన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యజమాని మురిపెంగా చూసుకుంటున్నారు. ఇక ఈ కుక్క జన్మించినపుడు దాని బరువు కేవలం 28.34 గ్రాములే. అప్పట్లో టీ స్పూన్ అంత పొడవు ఉండేదట. యజమాని వానెసా అతి జాగ్రత్తగా చూసుకుని దీన్ని సంరక్షించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement