ఫ్యాషన్ అలర్ట్ | Fashion alert to Smart bands | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ అలర్ట్

Oct 11 2015 3:08 AM | Updated on Apr 4 2019 5:12 PM

ఫ్యాషన్ అలర్ట్ - Sakshi

ఫ్యాషన్ అలర్ట్

అమ్మాయిలూ... స్మార్ట్ వాచీలు, స్మార్ట్ బ్యాండ్‌లను మరిచిపోండి.

అమ్మాయిలూ... స్మార్ట్ వాచీలు, స్మార్ట్ బ్యాండ్‌లను మరిచిపోండి. ఇప్పుడు మీ అభిరుచులకు సరిపడే, అచ్చమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్ గాడ్జెట్ వచ్చేసింది. బాగా వెడల్పుగా ఉన్న గాజులా కనపడే ఈ ‘ఐ క్యాచర్ బ్రాస్‌లెట్’ యువతులకు బాగా నప్పుతుంది. స్మార్ట్‌ఫోన్‌కు బ్లూటూత్‌తో కనెట్ట్ అయ్యే ఈ బ్రాస్‌లెట్ మన ఫోన్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్వీటర్... ఇలా అన్ని సందేశాలను ఐదు అంగుళాల తెరపై చక్కగా చూపుతుంది. మనల్ని అలర్ట్ చేస్తుంది.
 
 అంటే మనం తరచూ ఫోన్‌ను చెక్ చేయనక్కర్లేదు. ఈ బ్రాస్‌లెట్ తెరపైనే వచ్చిన సందేశాలను చదువుకోవచ్చు. దీనికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే అమ్మాయిలు తాము వేసుకున్న డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా దీని డిస్‌ప్లే డిజైన్‌ను మార్చుకోవచ్చు. కాలిఫోర్నియాలోని ఒక్లాండ్‌కు చెందిన లుక్‌సీ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన దీని ధర దాదాపు 15,500 రూపాయలు. అయితే ఇది ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లోనే అందుబాటులో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement