ఎగ్జిట్ పోల్స్.. ఎంతవరకు నిజం? | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్ పోల్స్.. ఎంతవరకు నిజం?

Published Thu, Mar 9 2017 8:56 AM

ఎగ్జిట్ పోల్స్.. ఎంతవరకు నిజం? - Sakshi

ఎన్నికలు జరిగిన తర్వాత వాటిలో ఎవరు గెలుస్తారో.. ఎవరు పరాజితులు అవుతారో చెప్పడం అంత సులభం కాదు. అందులోనూ పలు దశలుగా ఎన్నికలు జరిగినప్పుడు, పెద్ద రాష్ట్రాలు అయినప్పుడు ఓటర్ల నాడిని పసిగట్టడం అంటే చాలా కష్టం అవుతుంది. రెండు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్న ఈ తరుణంలో గురువారం సాయంత్రం ఐదు గంటల తర్వాత వివిధ మీడియా సంస్థలు తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించనున్నాయి. వాస్తవానికి బుధవారంతోనే మొత్తం ఎన్నికలు పూర్తయిపోయినా.. ఒకటి రెండు చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో వాటి కోసం గురువారం సాయంత్రం వరకు ఆగుతున్నారు.

ఇంతకుముందు కూడా పలు ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి గానీ.. వాటిలో వాస్తవాలు చూస్తే నేతిబీరలో నెయ్యిలాగే ఉంటున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో పార్టీవైపు మొగ్గుచూపుతున్న ఈ ఎగ్జిట్ పోల్స్ గతంలో వివిధ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పాయో.. వాటిలో నిజానిజాలు ఏంటో ఒక్కసారి చూస్తే, వీటిమీద ఎంతవరకు ఆధారపడవచ్చో అర్థం అవుతుంది. ఒక్కోసారి కొన్ని కొన్ని సంస్థలు కాస్త దగ్గరగా వచ్చి, కొంతవరకు ట్రెండ్లను అంచనా వేస్తున్నాయి గానీ, లెక్కల్లో మాత్రం చాలా తేడాలుంటున్నాయి. 2015 ఢిల్లీ అసెంబ్లీ, 2015 బిహార్ అసెంబ్లీ, 2014 యూపీలో లోక్‌సభ ఎన్నికలు, 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ మీడియా సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు - 2015 ఫిబ్రవరి

మీడియా సంస్థ ఆప్   బీజేపీ   కాంగ్రెస్   ఇతరులు
న్యూస్24-టుడేస్ చాణక్య 48   22   0 0
ఏబీపీ నీల్సన్ 43 26 1 0
ఇండియాన్యూస్ - యాక్సిస్ 53 17 0-2 0
ఇండియాటుడే -సిసిరో 38-46 19-27 3-5 0-2
న్యూస్ నేషన్ 41-45 23-27 1-3 0-1
ఇండియాటీవీ - సీఓటర్ 35-43 25-33 0-2 0-2
డేటామినెరియా 31 35 4 0

(మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 67 సాధిస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇండియాన్యూస్ - యాక్సిస్ కాస్త దగ్గరగా వచ్చింది)

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2015

మీడియా సంస్థ జేడీయూ+ఆర్జేడీ+కాంగ్రెస్ బీజేపీ కూటమి ఇతరులు
న్యూస్24-టుడేస్ చాణక్య 83 155 5
ఏబీపీ నీల్సన్ 130 108 5
న్యూస్ ఎక్స్-సీఎన్ఎక్స్ 130-140 90-100 13-23
ఇండియాటుడే -సిసిరో   111-123 113-127 4-8
ఇండియాటీవీ - సీఓట్   104-120 109-125 6-14
టైమ్స్ నౌ - సీఓటర్ 122 111 10
న్యూస్ నేషన్ 120-124 115-119 35

(జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమి 178 స్థానాలు సాధించగా, బీజేపీ కూటమికి 58 వచ్చాయి. అందరూ తప్పే.)

ఉత్తరప్రదేశ్ లోక్‌సభ 2014

మీడియా సంస్థ బీజేపీ   ఎస్పీ   బీఎస్పీ   కాంగ్రెస్
లోక్‌నీతి-సీడీఎస్ 45-53 13-17 10-14 3-5
ఏబీపీ న్యూస్ 46 12 13 8
టైమ్స్ నౌ-ఓఆర్‌జీ 52 12 6 10
సీఓటర్-ఇండియాటీవీ 54 11 8 7
చాణక్య/న్యూస్24 67 3 4 3
ఎన్డీటీవీ-హన్స 56 0 0 0

(చాణక్య/న్యూస్24 కాస్త పర్వాలేదు. బీజేపీకి 67 వస్తాయని వారు చెబితే 71 వచ్చాయి.)

యూపీ అసెంబ్లీ ఎన్నికలు 2012

మీడియా సంస్థ ఎస్పీ   బీఎస్పీ   బీజేపీ   కాంగ్రెస్+ఆర్ఎల్డీ స్వతంత్రులు   ఇతరులు
హెడ్‌లైన్స్ టుడే 195-210 88-56 50-56 38-42 12-18 0
ఇండియాటుడే-సీఓటర్ 137-145 122-130 79-87 39-55 0 2-10
న్యూస్24 చాణక్య 185 85   70   0 23 0
స్టార్-ఏసీ నీల్సన్ 183   83   71   51 11 2
సహారా న్యూస్ 188   123   64   32   22   0

(సమాజ్‌వాదీ పార్టీకి 224 సీట్లు వచ్చాయి. 195-210 వస్తాయని చెప్పిన హెడ్‌లైన్స్ టుడే ఒక్కటే దగ్గరగా వచ్చింది)

Advertisement
Advertisement