ఎవరొచ్చారో చూపిస్తుంది | Sakshi
Sakshi News home page

ఎవరొచ్చారో చూపిస్తుంది

Published Sun, Oct 4 2015 1:55 AM

ఎవరొచ్చారో చూపిస్తుంది - Sakshi

ఆదివారం హాయిగా కాసేపు పడుకుందామంటే... ఎవరో ఒకరు తలుపు కొడుతూనే ఉన్నారు. పాలవాడు, సేల్స్‌మెన్ లేదా మరొకరు చికాకు పెట్టేస్తున్నారు. మీ బెడ్‌పై నుంచి లేవకుండానే డోర్ కొడుతున్నదెవరో చూసేస్తే. అదెలా సాధ్యమంటారా? ‘పీబుల్’ అనే చిన్న పరికరం ద్వారా. గుండ్రని విక్స్ డబ్బా పరిమాణంలో ఉండే పీబుల్‌ను ప్రధాన ద్వారానికి ఉన్న పీప్‌హోల్‌కు పెట్టేస్తే చాలు... మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎవరొచ్చారో చూసేయవచ్చు. అలాగే బయటికి వెళ్లినపుడు కూడా... మన ఇంటికి ఎవరొచ్చి వెళ్లారో చూడొచ్చు. ప్రధాన ద్వారం వద్ద ఏమాత్రం అలికిడి అయినా... మనిషి జాడ కనపడినా వెంటనే ఫోన్‌కు మెసేజ్ పంపిస్తుంది.

తర్వాత కావాలనుకుంటే ఎవరొచ్చారో మనం లైవ్‌లో చూసేయవచ్చు. వైఫై ఆధారంగా పనిచేసే పీబుల్ లైవ్ ఫీడ్‌ను నేరుగా మన స్మార్ట్‌ఫోన్‌కు పంపేయగలదు. డోర్ తెరిచి ఉంచినా అలర్ట్ చేస్తుంది. టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు చెందిన క్రిస్ చటర్ దీన్ని రూపొందించారు. వినూత్న ఆవిష్కరణగా ఇది బ్రిటన్‌కు చెందిన జేల్యాబ్ ఇనీషియేటివ్ అవార్డును కూడా పొందింది.

Advertisement
Advertisement