కాంగ్రెస్ నుంచి జీకే వాసన్ బహిష్కరణ! | congress party expells gk vasan | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నుంచి జీకే వాసన్ బహిష్కరణ!

Nov 3 2014 5:19 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ నుంచి జీకే వాసన్ బహిష్కరణ! - Sakshi

కాంగ్రెస్ నుంచి జీకే వాసన్ బహిష్కరణ!

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. తమిళనాట కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించిన జీకే వాసన్ను తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. తమిళనాట కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించిన జీకే వాసన్ను తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే ఈ బహిష్కరణ వేటు వేసినట్లు అధిష్ఠానం చెబుతోంది.

అయితే, ఇప్పటికే తనంతట తానుగా బయటకు వెళ్లిపోయి, కొత్త పార్టీ కూడా పెడతానని చెప్పిన వాసన్ను ఇప్పుడు కాంగ్రెస్ బహిష్కరించడం ఏంటన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ తమిళనాడు శాఖకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదని ముందునుంచే అక్కడి నేతలు రుసరుసలాడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వాసన్, రేపు మరికొందరు బయటకు వెళ్లడం ఖాయమని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement