బట్టలిప్పుకొని పనిచేయాలంటే ఇలా అర్థమైందా...! | Aliaksandr Yarashuk: House Of Representatives Is To Legalize slavery In Belarus | Sakshi
Sakshi News home page

బట్టలిప్పుకొని పనిచేయాలంటే ఇలా అర్థమైందా...!

Jun 29 2016 8:29 PM | Updated on Sep 4 2017 3:43 AM

బట్టలిప్పుకొని పనిచేయాలంటే ఇలా అర్థమైందా...!

బట్టలిప్పుకొని పనిచేయాలంటే ఇలా అర్థమైందా...!

తూర్పు యూరప్ దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో దేశంలోని ఉద్యోగులనుద్దేశించి ఇచ్చిన పిలుపు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

మినిస్క్: తూర్పు యూరప్ దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో దేశంలోని ఉద్యోగులనుద్దేశించి ఇచ్చిన పిలుపు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఆయన భావగర్భితంగా ఇచ్చిన పిలుపును కాస్త ఉద్యోగులు మరో రకంగా తీసుకున్నారు. ఆయన భావాన్ని అర్థం చేసుకుండా ఆయన చెప్పిన మాటలను అక్షరాల అమలుచేస్తూ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి అంకితభావంతో కష్టపడి పనిచేయడం ఎంత అవసరమో స్ఫూర్తిదాయకంగా చెప్పేందుకు లుకషెంకో ప్రయత్నించి బోల్తాపడ్డారు.

‘గెట్ అన్‌డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు గెట్ స్వెట్ (బట్టలిప్పుకొని పనిచేయండి చెమటలు కక్కేదాక)’ అంటూ ఆయనిచ్చిన సందేశంలోని సారాంశాన్ని పట్టించుకోకుండా బెలారస్ ఉద్యోగులు ఆయన మాటలను అక్షరాల అమలు చేయడానికి ఆఫీసుల్లో బట్టలిప్పుకొని పనిచేస్తున్నారు. అలా పనిచేస్తున్న దృశ్యాలను ఫొటోలుతీసి మరి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ఎడతెరపి లేకుండా పోస్ట్ చేస్తున్నారు. కామెంట్లు కూడా పెడుతున్నారు..

అయితే ఈ ఫొటోల్లో మగవాళ్లతోపాటు ఆడ ఉద్యోగులు కూడా బట్టలు లేకుండా ఫొటోలు దిగడం యూరప్‌లాంటి దేశంలో కూడా కొంత ఆశ్చర్యమే. కాకపోతే వారంతా తమ మానాన్ని రక్షించుకునేందుకు లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు అడ్డుగా పెట్టుకోవడం ఉన్నంతలో కాస్త మెరుగైన అంశం. ఇది ఒక్క ఉద్యోగస్థులకే పరిమితం కాలేదు. సంగీత కళాకారులు కూడా బట్టలిప్పేసి వాయిద్యాలతో మానాన్ని దుచుకుంటూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. వారిని భవన నిర్మాణ కార్మికులు కూడా అనుసరిస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్  చేస్తున్నారు.

‘బట్టలిప్పుకొని పనిచేయాలని మన దేశాధ్యక్షుడే చెబుతున్నారు’ లాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. తమతో పాటు దేశాధ్యక్షుడు లుకషెంకో కూడా బట్టలిప్పుకొని పనిచేస్తున్నట్టు ఫొటోషాప్‌లో మార్పిడి చేసిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. దీనిపై స్పందించేందుకు లుకషెంకో ప్రస్తుతానికి అందుబాటులో లేరు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement