స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పైలట్! | air india pilot caught while smuggling gold | Sakshi
Sakshi News home page

స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పైలట్!

Aug 11 2016 11:09 AM | Updated on Aug 2 2018 4:08 PM

స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పైలట్! - Sakshi

స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పైలట్!

ఆయనో సీనియర్ పైలట్. ఎయిరిండియాలో సుదీర్ఘ అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి అరెస్టయి.. అనంతరం బెయిల్ మీద విడుదల అయ్యారు.

ఆయనో సీనియర్ పైలట్. ఎయిరిండియాలో సుదీర్ఘ అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి అరెస్టయి.. అనంతరం బెయిల్ మీద విడుదల అయ్యారు. దాదాపు రూ. 16 లక్షల విలువ చేసే 600 గ్రాముల బంగారు కడ్డీలను ఆ పైలట్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు ముంబై విమానాశ్రయంలో గుర్తించారు. ఆయన ఏడు బంగారు కడ్డీలను తన చెకిన్, హ్యాండ్ బ్యాగేజిలో ఉంచుకున్నారు. వాటిని గమనించిన కస్టమ్స్ సిబ్బంది ఇదేంటని అడిగితే.. వాటిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అంగీకరించారు.

ఈ విషయాన్ని కస్టమ్స్ శాఖకు చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలిపింది. సాధారణంగా విమానంలో వెళ్లే ప్రయాణికులతో పాటు సిబ్బంది అందరినీ కూడా తప్పనిసరిగా చెక్ చేస్తారు. అందులో భాగంగానే ఈ పైలట్‌ను కూడా తనిఖీ చేశారని, అప్పుడే బంగారం బయట పడిందని ముంబై విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటనపై ఎయిరిండియా మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement