తాడ్వాయిలో మావోయిస్టుల దుశ్చర్య | wildlife vehicle catch fire in warangal district | Sakshi
Sakshi News home page

తాడ్వాయిలో మావోయిస్టుల దుశ్చర్య

Apr 16 2016 9:04 AM | Updated on Oct 9 2018 2:51 PM

తాడ్వాయిలో మావోయిస్టుల దుశ్చర్య - Sakshi

తాడ్వాయిలో మావోయిస్టుల దుశ్చర్య

వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం వనకుటీరాలో మావోయిస్టులు దుశ్చర్యకు దిగారు.

తాడ్వాయి: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం వనకుటీరాలో మావోయిస్టులు దుశ్చర్యకు దిగారు. వైల్డ్‌ లైఫ్ విభాగానికి చెందిన ఓ వాహనాన్ని , మరో ఇంటిని శుక్రవారం రాత్రి మావోయిస్టులు తగలబెట్టారు. హరితహారం పేరుతో పీడిత వర్గాల భూములను లాక్కోవాలని టీఎస్ ప్రభుత్వం చూస్తోందని, ఆదివాసీల పోడుభూములను స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి తగిన విధంగా బుద్దిచెబుతామని హెచ్చరించారు. గ్రీన్‌హంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని సంఘటనాస్థలంలో వదిలి వెళ్లిన లేఖలో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement