మొగిలయ్యను ఆదుకుంటాం | wev are helping to mogilaiah | Sakshi
Sakshi News home page

మొగిలయ్యను ఆదుకుంటాం

Jul 26 2018 5:37 AM | Updated on Jul 26 2018 5:37 AM

wev are helping to mogilaiah - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్యను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ వెల్లడించారు. సాక్షిలో ‘కిన్నెర మెట్లు.. బతుకు పాట్లు’ శీర్షికన మంగళ వారం మొగిలయ్య దీనగాథ ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన హరికృష్ణ బుధవారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. కిన్నెర వాయిద్యం కళను వెలికితీయడంతోపాటు మొగిలయ్యను తెలంగాణ ప్రభుత్వం ఆదరించిందని గుర్తుచేశారు. మొగిలయ్యకు కళాకారుల కోటాలో నెలనెలా పింఛన్‌ అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కళాకారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్య తాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement