19న తెలంగాణ లాసెట్ | telangana law cet on may 19 th | Sakshi
Sakshi News home page

19న తెలంగాణ లాసెట్

May 7 2015 9:46 PM | Updated on Oct 16 2018 2:49 PM

తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులో ప్రవేశాలకు, ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశాలకు లాసెట్‌ను ఈనెల 19న నిర్వహించనున్నట్లు లాసెట్ కన్వీనర్, కేయూ లా కళాశాల ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు తెలిపారు.

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులో ప్రవేశాలకు, ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశాలకు లాసెట్‌ను ఈనెల 19న నిర్వహించనున్నట్లు లాసెట్ కన్వీనర్, కేయూ లా కళాశాల ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు తెలిపారు. మొత్తం 19,135 మంది అభ్యర్థుల కోసం తొమ్మిది రీజినల్ సెంటర్లలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుకు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు.

ఎల్‌ఎల్‌ఎం కోసం 1516 మంది దరఖాస్తు చేసుకోగా వీరికోసం రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 19న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష జరగనుందని వెల్లడించారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను డబ్లూడబ్లూడబ్లూటీఎస్ లాసెట్. ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
(కేయూ క్యాంపస్)

Advertisement
 
Advertisement
Advertisement