తెలంగాణ లాసెట్-2015 ప్రవేశపరీక్ష ప్రారంభం | telangana law cet begin | Sakshi
Sakshi News home page

తెలంగాణ లాసెట్-2015 ప్రవేశపరీక్ష ప్రారంభం

May 19 2015 10:00 AM | Updated on Oct 16 2018 2:49 PM

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం లాసెట్-2015 ప్రవేశపరీక్ష ప్రారంభమైంది. ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం లాసెట్-2015 ప్రవేశపరీక్ష ప్రారంభమైంది. ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులు, ఎల్‌ఎల్‌ఎం కోర్సులో 2015-16 ప్రవేశాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 19,291మంది విద్యార్థులు లాసెట్ రాస్తున్నారు. మూడేళ్ల లా కోర్సుకు గోదావరి, అయిదేళ్ల కోర్సుకు శాతవాహన, ఎల్ఎల్ఎం కోర్సుకు భద్రాద్రి ప్రశ్నాపత్రాలను ఎంపిక చేశారు.

ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుకు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, ఎల్ఎల్ఎం కోర్సుకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement