రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర వెంకటవీరయ్య | sandra venkata veeraiah sent to two day acb custody | Sakshi
Sakshi News home page

రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర వెంకటవీరయ్య

Jul 8 2015 4:19 PM | Updated on Aug 25 2018 6:06 PM

రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర వెంకటవీరయ్య - Sakshi

రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర వెంకటవీరయ్య

ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను రెండు రోజుల ఏసీబీ కస్టడీకి పంపుతూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది.

ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను రెండు రోజుల ఏసీబీ కస్టడీకి పంపుతూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. రేపు, ఎల్లుండి .. అంటే 9, 10 తేదీలలో ఆయనను ఏసీబీ విచారణ చేసేందుకు కోర్టు అనుమతించింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విచారణ చేసుకోవచ్చు. కస్టడీ అనంతరం సండ్ర వెంకట వీరయ్యను కోర్టులో హాజరు పరచాలని కూడా ఆదేశించారు.

విచారణ సమయంలో న్యాయవాదులు కూడా అక్కడే ఉండాలని కోర్టు తెలిపింది. కాగా, ఈ కేసులో సండ్ర వెంకట వీరయ్యను సమగ్రంగా విచారించి.. మరింత సమాచారన్ని రాబట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. వాస్తవానికి వెంకట వీరయ్యను ఐదు రోజుల కస్టడీకి పంపాలని ఏసీబీ కోరింది. అయితే కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడీని మాత్రమే మంజూరు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement