సాక్షి ‘మైత్రి’కి విశేష స్పందన | sakshi maitri good response | Sakshi
Sakshi News home page

సాక్షి ‘మైత్రి’కి విశేష స్పందన

Apr 12 2014 5:04 AM | Updated on Aug 20 2018 8:20 PM

సాక్షి ‘మైత్రి’కి విశేష స్పందన - Sakshi

సాక్షి ‘మైత్రి’కి విశేష స్పందన

మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు, స్వయం ఉపాధితో మెరుగైన భవితనందించేందకు ‘సాక్షి’ ప్రారంభించిన ‘మైత్రి మహిళ’కు విశేష స్పందన వస్తోంది.

సాక్షి, సిటీబ్యూరో: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు, స్వయం ఉపాధితో మెరుగైన భవితనందించేందకు ‘సాక్షి’ ప్రారంభించిన ‘మైత్రి మహిళ’కు విశేష స్పందన వస్తోంది. శుక్రవారం మైత్రి మహిళ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టైలరింగ్  వర్క్‌షాప్ (కుట్టు శిక్షణ)నకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు.

ఉషా మిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో అధునాతన డిజైన్లతో టైలరింగ్‌లో రాణించేందుకు అవసరమైన మెళుకువలను నిపుణుల పర్యవేక్షణలో నేర్పించారు. ‘మైత్రి మహిళ’ ఎంతో మందికి ఉపయోగపడుతోందని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సంతోషం వ్యక్తంచేశారు. ఈ శిక్షణ ద్వారా టైలరింగ్‌లో వస్తున్న ఆధునాతన డిజైన్లు, మార్పులను తెలుసుకోగలిగామన్నారు.

ఇలాంటి కార్యక్రమాలను ‘సాక్షి’ మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా... వంటలు, స్వయం ఉపాధి, బోధన, వ్యాపార, ఆరోగ్య, న్యాయ సలహాల వంటి అంశాల్లో మహిళలకు శిక్షణ ఇస్తారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 95055 55020 నంబర్‌లో సంప్రదించవచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement