హైదరాబాద్‌లో భారీ వర్షం..! | Rains In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం..!

May 21 2019 8:11 PM | Updated on May 21 2019 8:16 PM

Rains In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ : వేసవితో అల్లాడుతున్న నగరవాసులను మళ్లీ వర్షం పలుకరించింది. మంగళవారం సాయంత్రం నగరంలో పలుచోట్ భారీ వర్షం కురుస్తోంది. వర్షంతోపాటు భారీగా ఉరుములు, మెరుపులు చోటుచేసుకోవడం.. గాలులు బలంగా వీస్తుండటం నగరవాసులను కలవరపెడుతోంది. మాదాపూర్, కూకట్‌పల్లి, గచ్చీబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో వర్షం కురుస్తోంది. దీంతో ఆఫీసుల, వివిధ పనుల నుంచి ఇంటికివెళ్లే వారు రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు. ఆకస్మిక వర్షం పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు గాలి దుమారం రేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం ప్రాంతాల్లోనూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా విద్యుత్ నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement