ఓయూ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల | Osmania University Revaluation Results 2020 Declared | Sakshi
Sakshi News home page

ఓయూ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల

Apr 25 2020 2:40 PM | Updated on Apr 25 2020 2:40 PM

Osmania University Revaluation Results 2020 Declared - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల మొదటి, మూడో, అయిదో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల రివాల్యుయేషన్‌ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో ఉంచినట్లు ఆయన చెప్పారు.

ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, ఇంగ్లీష్‌, ఆర్కియాలజీ, ఉర్దూ, పర్షియన్‌, ఫిలాసఫీ, మరాఠీ విభాగాల్లో ఎంఏ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌, ఎంకాం ప్రధమ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement