విష జ్వరాల బారిన ఆ గ్రామం.. | mulkalapally attacked with viral feavers | Sakshi
Sakshi News home page

విష జ్వరాల బారిన ఆ గ్రామం..

Aug 5 2015 2:55 PM | Updated on Sep 3 2017 6:50 AM

ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెం గ్రామం విష జ్వరాల బారిన పడింది.

ముల్కలపల్లి(ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెం గ్రామం విష జ్వరాల బారిన పడింది. గ్రామంలోని పలువురు విష జ్వరాలు రావడంతో సమీపంలోని పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో వైద్యం చేయించుకుంటున్నారు. దీంతో గ్రామంలో మంగళవారం నుంచి ప్రభుత్వం హెల్త్‌క్యాంప్‌ను నిర్వహిస్తోంది. ఈ హెల్త్‌క్యాంప్‌ను, సంబంధిత గ్రామాన్ని బుధవారం అడిషనల్ డీఎమ్ అండ్ హెచ్‌వో పుల్లయ్య సందర్శించారు. గ్రామంలో ప్రజలు పరిశుభ్రత పాటించాలని తద్వారా ఆనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement