ప్రేమించినవాడితో పెళ్లి జరిపించాలని.. | Lover Cheated Girl Protest Karimnagar | Sakshi
Sakshi News home page

ప్రేమించినవాడితో పెళ్లి జరిపించాలని..

Jun 14 2019 8:08 AM | Updated on Jun 14 2019 8:08 AM

Lover Cheated Girl Protest Karimnagar - Sakshi

ట్యాంకు దిగి వస్తున్న అనూష

పెద్దపల్లి: ‘మూడేళ్లుగా ప్రేమించుకున్నాం..ఆతడిని నమ్ముకుని సర్వం అర్పించా..ఇప్పుడు పెళ్లి చేసుకోనని మొండికేస్తున్న యువకుడితోనే పెళ్లి జరిపించాలని దామ అనూష అనే యువతి గురువారం పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. అప్పన్నపేట గ్రామానికి చెందిన దామ అనూష(20) అదే గ్రామానికి చెందిన అనవేని శ్రీకాంత్‌(24) మూడేళ్లుగా ప్రేమించుకుటున్నారు.

కొద్దిరోజులుగా వేరే అమ్మాయితో పెళ్లి జరిపించేందుకు శ్రీకాంత్‌ తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించడంతో విషయం తెలుసుకున్న అనూష గురువారం వాటర్‌ ట్యాంకు ఎక్కింది. దీంతో స్థానికులు పెద్దపల్లి సీఐ నరేందర్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న సీఐ, అనూషతో మాట్లాడి సముదాయించి కిందకు దింపారు. గ్రామస్తులు అనూష, శ్రీకాంత్‌ల పెళ్లి జరిపించాలని పట్టుబట్టారు. చట్టంప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ హామీఇచ్చారు. మరోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించి జంటను కలపాలని యువతికి న్యాయం చేయాలని అనూష బంధువులు సీఐని వేడుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement