ఐడీఏ బొల్లారంలోని పరిశ్రమలో అగ్నిప్రమాదం | Fire accident in ida bollaram | Sakshi
Sakshi News home page

ఐడీఏ బొల్లారంలోని పరిశ్రమలో అగ్నిప్రమాదం

May 10 2015 8:56 AM | Updated on Sep 5 2018 9:45 PM

మెదక్ జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.

మెదక్ : మెదక్ జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు  ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై భద్రత సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement