తెలంగాణలో 31 డీసీసీలకు కొత్త అధ్యక్షులు వీరే | Congress Announces New DCC Presidents Names | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 31 డీసీసీలకు కొత్త అధ్యక్షులు వీరే

Feb 7 2019 6:49 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Announces New DCC Presidents Names - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షులను(డీసీసీ) ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 31 మంది డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఆ పార్టీ అధినేత రాహుల్‌ ఆమోదం తెలిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు.

వీరిలో 12 మంది బీసీలు, రెడ్డి-9, కమ్మ -2, బ్రాహ్మణలు, ఎస్సీ, ఎస్టీలలో ఇద్దరికి.. ముస్లిం, వెలమలకు ఒక్కొక్కరికి చొప్పున చోటు కల్పించారు. వీరితో పాటు ఇద్దరు సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులను ఆ పార్టీ నియమించింది. ఖమ్మం పట్టణానికి చెందిన దీపక్‌ చౌదరిని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 33 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ గురువారం విడుదల చేసింది.

ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి కూడా డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, ఆసిఫాబాద్‌- ఆత్రం సక్కు, భద్రాది- వనమ వెంకట్వేరరావులను డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. వీరితో పాటు ఎమ్మెల్యేల సతీమణులను కూడా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా నియమించారు. ఖమ్మం నగరం- జావీద్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌- ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌లను సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా నియమించారు. 

కొత్తగా నియమితులైన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు వీరే..

జిల్లా పేర్లు డీసీసీ అధ్యక్షుల పేర్లు
మంచిర్యాల కొక్కిరాల సురేఖ
కొమరం భీమ్‌ ఆసిఫాబాద్ ఆత్రం సక్కు
 
నిర్మల్  రామారావు పటేల్‌ పవార్‌
కరీంనగర్‌   కె. మృతంజయం
 
జగిత్యాల లక్ష్మణ్‌కుమార్‌
పెద్దపల్లి ఈర్ల కొమురయ్య
 
రాజన్న సిరిసిల్ల ఎన్‌.సత్యనారాయణగౌడ్‌
నిజామాబాద్ మనాల మోహన్‌ రెడ్డి
నిజామాబాద్‌ నగర కాంగ్రెస్‌ కేశ వేణు
కామారెడ్డి కైలాస్‌ శ్రీనివాసరావు
వరంగల్‌ రూరల్‌/ అర్బన్‌  నాయిని రాజేందర్‌ రెడ్డి
వరంగల్‌ నగర కాంగ్రెస్‌  కేదారి శ్రీనివాసరావు
జయశంకర్‌ భూపాల్‌పల్లి  గండ్ర జ్యోతి
జనగామ  జంగా రాఘవ రెడ్డి
సంగారెడ్డి నిర్మలాగౌడ్‌
మెదక్‌ తిరుపతి రెడ్డి
సిద్దిపేట టి.నరసారెడ్డి
వికారాబాద్ పి.రోహిత్‌ రెడ్డి
మేడ్చల్‌ మల్కాజిగిరి కూన శ్రీశైలం గౌడ్‌
రంగారెడ్డి చల్లా నరసింహారెడ్డి
మహబూబ్‌నగర్ కొత్వాల్‌ ఒబెదుల్లా
వనపర్తి  శంకర్‌ ప్రసాద్‌
జోగులాంబ గద్వాల్ పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి
నాగర్‌కర్నూల్ సీహెచ్‌ వంశీకృష్ణ
సూర్యాపేట చెవిటి వెంకన్న యాదవ్‌
యాదాద్రి భువనగిరి బి.బిక్ష్మయ్యగౌడ్
మహబూబాబాద్  జె.భరత్‌ చంద్రారెడ్డి
నల్గొండ  కె.శంకర్‌నాయక్‌
భద్రాద్రి కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు
ఖమ్మం పువ్వాడ దుర్గాప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement