వెల్‌కమ్ ఒబామా | barack obama invited to telangana | Sakshi
Sakshi News home page

వెల్‌కమ్ ఒబామా

Dec 3 2014 1:57 AM | Updated on Sep 2 2017 5:30 PM

వెల్‌కమ్ ఒబామా

వెల్‌కమ్ ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలంగాణను సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది.

 అమెరికా అధ్యక్షుడికి తెలంగాణ సర్కారు ఆహ్వానం
 
 సాక్షి, హైదరాబాద్:  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలంగాణను సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. వచ్చే నెలలో భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు వస్తున్న ఒబామాను హైదరాబాద్‌కు కూడా ఆహ్వానించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసినట్లు ప్రభుత్వవర్గాలు వివరించాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా  భారతదేశ సందర్శన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చే అంశంపై ఇదివరకే తమ మంత్రి తారక రామారావు అమెరికా ఎంబసీతో మాట్లాడిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన లేఖలో ప్రస్తావించినట్లు ఆ వర్గాలు వివరించాయి. కాగా మంగళవారం సచివాలయంలో అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ (పొలిటికల్, మిలటరీ) పునీత్ తల్వార్‌తోపాటు వచ్చిన ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. రాష్ట్రంలో పెట్టుబడులు, అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement