గుండెపోటుతో యువ ఎస్సై మృతి | asi died due to heart stroke | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో యువ ఎస్సై మృతి

Nov 15 2015 10:13 AM | Updated on Aug 20 2018 5:11 PM

గుండెపోటుతో యువ ఎస్సై మృతి - Sakshi

గుండెపోటుతో యువ ఎస్సై మృతి

ఓ యువ ఎస్సై గుండెపోటుకు గురై మృతిచెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

ఆదిలాబాద్: ఓ యువ ఎస్సై గుండెపోటుకు గురై మృతిచెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఆర్. ఉమా మహేష్(29) 2012 లో ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. విధుల్లో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నివాసముంటున్నాడు.
 
ఈ క్రమంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి ఖానాపూర్‌కు వచ్చాడు. ఈ రోజు ఉదయం గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు నిర్మల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య ఒక పాప ఉంది. మహేష్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement