‘జేఎన్‌టీయూలో నియామకాలు ఆపండి’ | appointments Stop in jntu:Ponnala Lakshmaiah | Sakshi
Sakshi News home page

‘జేఎన్‌టీయూలో నియామకాలు ఆపండి’

May 12 2014 1:43 AM | Updated on Sep 2 2017 7:14 AM

‘జేఎన్‌టీయూలో నియామకాలు ఆపండి’

‘జేఎన్‌టీయూలో నియామకాలు ఆపండి’

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలో అధ్యాపక ఖాళీల నియామకాలను తక్షణమే నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోరారు.

సాక్షి, హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలో అధ్యాపక ఖాళీల నియామకాలను తక్షణమే నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోరారు. ఆదివారం సాయంత్రం వర్సిటీకి చెందిన పలువురు టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు పొన్నాలను కలిశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ 186 టీచింగ్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారని, సీమాంధ్ర ప్రాంతం వారిని నియమించేందుకే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన పొన్నాల వెంటనే వర్సిటీ ఉపకులపతి రామేశ్వర్‌రావుకు ఫోన్ చేసి నియామకాలను ఆపాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement