నీటితొట్టెలో పడి చిన్నారి మృతి | 14 months old boy drowns in water tank | Sakshi
Sakshi News home page

నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

Jun 16 2016 7:55 PM | Updated on Sep 4 2017 2:38 AM

ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

పెనుబల్లి (ఖమ్మం) : ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వెంకటేష్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి లోకేష్(14 నెలల) అనే బాబు ఉన్నాడు. గురువారం వెంకటేష్ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో అతని భార్య ఇంటి పనులు చక్కబెడుతుండగా.. ఇంటి ముందు ఆడుకుంటున్న లోకేష్ ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడి మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement