బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ త్వరలో.. ధర? | BlackBerry expected to launch its first QWERTY keyboard Android phone KEYone in India | Sakshi
Sakshi News home page

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ త్వరలో.. ధర?

Jul 29 2017 7:21 PM | Updated on Aug 18 2018 4:44 PM

బ్లాక్‌బెర్రీ కొత్త  స్మార్ట్‌ఫోన్‌ త్వరలో.. ధర? - Sakshi

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ త్వరలో.. ధర?

కెనడియన్ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ బ్లాక్‌ బెర్రీ త్వరలో భారతదేశంలో త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.

కెనడియన్ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ బ్లాక్‌ బెర్రీ త్వరలో భారతదేశంలో త్వరలో   కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.  తాజా నివేదికల ప్రకారం బ్లాక్‌బెర్రీ  స్మార్ట్‌ఫోన్ 'కీవన్' ను ఆగస్టు 1వ తేదీన   ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది.  ఈ ఏడాది ఫిబ్రవరి వరల్డ్‌ కాంగ్రెస్‌ లో దీన్ని ప్రదిర్శించింది.  కంపెనీ హార్డ్‌ వేర్‌ పార్టనర్‌ టీసీఎల్‌  భాగస్వామ్యంతో దీన్ని   రూపొందించింది.   దీని ధర సుమారు రూ.43వేలుగా నిర్ణయించినట్టు సమాచారం. కాగా  లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో వస్తున్న ఈ కీ వన్‌   స్మార్ట్‌ఫోన్‌  ఆపిల్‌ ఐ ఫోన్‌ 7 కు ఇది గట్టిపోటీకానుందని భావిస్తున్నారు. 
బ్లాక్‌బెర్రీ కీవన్ ఫీచర్లు...
4.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, 
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
256జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3505 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement