ప్రియుడి ఇంటి వద్ద యువతి ఆందోళన | women protest at lovers home in peddapalli | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి వద్ద యువతి ఆందోళన

May 20 2017 4:36 PM | Updated on Sep 5 2017 11:36 AM

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని బాస చేసిన ప్రియుడు మొహం చాటేశాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది.

పెద్దపల్లి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని బాస చేసిన ప్రియుడు మొహం చాటేశాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. వివరాలివీ.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన శనిగారపు అజయ్ అనే యువకుడు కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందిన సౌజన్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అజయ్‌ మోసం చేశాడని సౌజన్య ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

Advertisement
 
Advertisement
Advertisement