నీ భర్తను నాకిచ్చేయి ... | Woman falling in love with Married person in Tamilnadu | Sakshi
Sakshi News home page

నీ భర్తను నాకిచ్చేయి ...

Jul 11 2014 9:02 AM | Updated on Sep 2 2017 10:09 AM

నీ భర్తను నాకిచ్చేయి ...

నీ భర్తను నాకిచ్చేయి ...

తన ప్రియుడిని దక్కించుకోవడానికి అతని భార్యతోనే రూ.10 లక్షలకు బేరమాడిన ప్రియురాలి వైనమిది.

తన ప్రియుడిని దక్కించుకోవడానికి అతని భార్యతోనే రూ.10 లక్షలకు బేరమాడిన ప్రియురాలి వైనమిది. మదురై తిరుమంగళం సమీపానగల నయనార్‌పట్టికి చెందిన  నాగరాజ్, వినోదిని (23) భార్యాభర్తలు. అయితే తిరుప్పరంగుండ్రం సమీపానగల హార్విపట్టికి చెందిన పేచ్చియమ్మాళ్ అలియాస్ సత్యా (23) మదురై హోంగార్డు విభాగంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నాగరాజ్‌కు, పేచ్చియమ్మాళ్‌తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇరువురూ విడిగా నివశిస్తు కుటుంబం నడిపారు. ఈ విషయం నాగరాజ్ భార్య వినోదినికి తెలిసింది.

 

దీంతో వినోదినికి, పేచ్చియమ్మాళ్‌కు మధ్య తగాదా ఏర్పడింది. పేచ్చియమ్మాళ్ వినోదినికి రూ.10 లక్షలు అందజేస్తానని, నాగరాజ్‌ను తనకు విడిచిపెట్టాలని కోరింది. ఇందుకు పేచ్చియమ్మాళ్ తండ్రి వానమామలై, తల్లి పాండియమ్మాల్‌కు కూడా సహకరించారు. అంతేకాకుండా వీరు వినోదిని ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశారు. దీనికి సంబంధించి వినోదిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమంగళం మహిళా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement