వరంగల్లో దారుణం : భర్తను నరికి చంపిన భార్య | wife killed her husband in bhupalpally | Sakshi
Sakshi News home page

వరంగల్లో దారుణం : భర్తను నరికి చంపిన భార్య

Sep 5 2016 9:14 AM | Updated on Sep 4 2017 12:25 PM

వరంగల్లో దారుణం : భర్తను నరికి చంపిన భార్య

వరంగల్లో దారుణం : భర్తను నరికి చంపిన భార్య

వరంగల్ జిల్లాలో భర్తను గొడ్డలితో దారుణంగా భార్య నరికి చంపిన ఘటన చోటుచేసుకుంది.

వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భర్తను గొడ్డలితో అత్యంత దారుణంగా భార్య నరికి చంపిన ఘటన భూపాలపల్లి మండలం జంగేడు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అనంతరం భర్త మృతదేహాన్ని ఇంట్లో ఉంచి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబకలహాల కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement