లతారజనీకాంత్‌ సంచలన వీడియో

Latha Rajinikanth Release Sentational Video on Child Harassments - Sakshi

తమిళనాడు, పెరంబూరు: నటుడు రజనీకాంత్‌ సతీమణి లతా రజనీకాంత్‌ అనాథ పిల్లల రక్షణ కోసం దయా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులోభాగంగా  పీస్‌ ఆఫ్‌ చిల్డ్రన్స్‌ పేరుతో సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం ఒక సంచలన విడియోను విడుదల చేశారు. అందులో ఒక స్త్రీ ఒక బాలికను చిత్ర వధ చేసి కాలితో తొక్కుతున్న దృశ్యం చోటు చేసుకుంది. కాగా ఆ వీడియోతో పాటు లతా రజనీకాంత్‌ ఒక విజ్ఞప్తి కూడా చేశారు. అందులో చిత్ర వధకు గురైన ఆ చిన్నారి గురించి తెలిసిన వారు తమకు తెలియజేయాలని ఒక ఫోన్‌ నంబరును కూడా పొందుపరిచారు. కాగా లతా రజనీకాంత్‌ విదుదల చేసిన ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top