భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం | huge red sandalwood surrendered in ysr district | Sakshi
Sakshi News home page

భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Nov 21 2016 7:23 PM | Updated on Sep 4 2017 8:43 PM

వైఎస్సార్ జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్సార్ జిల్లా : రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట చెరువుకట్ట పక్కన ముళ్ల పొదల్లో ఉన్న 9 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు రాకతో ఎర్రచందనం స్మగ్లర్లు దుంగలను ముళ్లపొదల్లో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement