దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ | Wrist injury rules de Kock out of India series | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ

Feb 5 2018 3:17 PM | Updated on Feb 5 2018 3:38 PM

Wrist injury rules de Kock out of India series - Sakshi

డీకాక్‌

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే స్టార్‌ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్‌, డు ప్లెసిస్‌లు గాయాల బారిన పడగా, తాజాగా మరో కీలక ఆటగాడు క్వింటాన్‌ డీకాక్‌కు కూడా గాయం కారణంగా సిరీస్‌ నుంచి వైదొలిగాడు. మణికట్టు గాయం కారణంగా మొత్తం భారత్‌తో సిరీస్‌ నుంచి డీకాక్‌ తప్పకున్నాడు. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో భారత పేసర్‌ బూమ్రా వేసిన షార్ట్‌ పిచ్‌ బంతి డీకాక్‌ చేతికి బలంగా తాకింది. ఆ నొప్పి తీవ్రం కావడంతో డీకాక్‌ అర్థాంతరంగా భారత్‌తో సిరీస్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

మిగిలిన నాలుగు వన్డేలతో పాటు మూడు ట్వంటీ 20ల సిరీస్‌కు డీకాక్‌ దూరం కానున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. డీకాక్‌ తిరిగి కోలుకోవడానికి రెండు వారాల నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో టీమిండియాతో సిరీస్‌ నుంచి డీకాక్‌ వైదొలగాల్సి వచ‍్చింది. అయితే అతని స్థానంలో మరొక ఆటగాడ్ని ఇంకా ఎంపిక చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement