క్వాలిఫయింగ్‌లో జ్యోతికి ఆరో స్థానం | Vennam Jyothi Surekha all set for the real test | Sakshi
Sakshi News home page

క్వాలిఫయింగ్‌లో జ్యోతికి ఆరో స్థానం

Oct 1 2013 1:34 AM | Updated on Sep 1 2017 11:12 PM

జూనియర్ స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సీనియర్ స్థాయిలోనూ సత్తా చాటుకుంది. టర్కీలో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ ఆరో స్థానంలో నిలిచింది.

న్యూఢిల్లీ: జూనియర్ స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సీనియర్ స్థాయిలోనూ సత్తా చాటుకుంది. టర్కీలో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ ఆరో స్థానంలో నిలిచింది.
 
 72 బాణాలు సంధించిన జ్యోతి మొత్తం 684 పాయింట్లు స్కోరు చేసింది. భారత్‌కే చెందిన త్రిషా దేవ్ 680 పాయింట్లతో 15వ స్థానంలో, జానూ హన్స్‌దా 645 పాయింట్లతో 69వ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురి స్కోర్లు పరిగణనలోకి తీసుకున్నాక కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు 10వ సీడింగ్ లభించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement