బొటాస్‌కు పోల్‌ పొజిషన్‌ | Valtteri Bottas takes pole as Lewis Hamilton starts in eighth following | Sakshi
Sakshi News home page

బొటాస్‌కు పోల్‌ పొజిషన్‌

Jul 9 2017 1:38 AM | Updated on Aug 21 2018 9:00 PM

ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ క్వాలిఫయింగ్‌ సెషన్‌లో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ బొటాస్‌ ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు.

స్పీల్‌బెర్గ్‌ (ఆస్ట్రియా): ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి  ఫార్ములావన్‌ క్వాలిఫయింగ్‌ సెషన్‌లో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ బొటాస్‌ ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. బొటాస్‌ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 04.251 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్‌ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మరోవైపు ప్రపంచ మాజీ చాంపియన్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ రెండో స్థానం నుంచి... భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్‌ ఏడు, ఒకాన్‌ తొమ్మిదో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు.

Advertisement
 
Advertisement
Advertisement