రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వాయిదా | supreme court to open sealed envelope of RCA election result on Jan 17 | Sakshi
Sakshi News home page

రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వాయిదా

Jan 6 2014 4:36 PM | Updated on Sep 2 2018 5:20 PM

రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల ఫలితాల విడుదలను ఈనెల 17కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల ఫలితాల విడుదలను సుప్రీం కోర్టు ఈనెల 17 వరకూ వాయిదా వేసింది. దీంతో ఆర్సీఏ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన లలిత్‌ మోడి భవితవ్యం తేలేందుకు మరో 11 రోజుల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఒకవైపు ఐపీఎల్  చైర్మన్‌గా కొనసాగిన రోజుల్లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ బిసిసిఐ ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్‌ ఒత్తిడి మేరకు లలిత్‌ మోడిని జీవిత కాలం నిషేధించారు. దాంతో బోర్డు అనుబంధ రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం మోడికి లేదు.

 

రాజస్థాన్‌ స్పోర్ట్స్‌ యాక్ట్‌లో వున్న వెసలు బాటు మేరకు పోటీ చేసిన మోడి దాదాపు ఎన్నికయ్యారని అనధికార సమాచారంతో తెలుస్తోంది. అయితే రాజస్థాన్‌ క్రికెట్‌ మాజీ కార్యదర్శి కిషన్‌ రూంగ్టా రాజస్థాన్‌ స్పోర్ట్స్‌ యాక్ట్‌ని సవాల్‌ చేసిన కేసులోనే బిసిసిఐ కూడా ఇంప్లీడ్‌ పిటీషన్‌ వేసింది. మోడిని ఎన్నుకుంటే రాజస్థాన్‌ను నిషేధిస్తామంటూ శ్రీనివాసన్‌ వర్గం హెచ్చరించింది కూడా. కాగా, ప్లేయర్లకు అన్యాయం జరగకుండా రంజీ సహా ఇతర టోర్నీల్లో పాల్గొనే వెసలు బాటు కల్పించే చాన్సెస్‌ వున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement