గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన స్టీవ్‌ స్మిత్‌

Steve Smith Marries Long Time Girlfriend Dani Willis - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు డానీ విల్లిస్‌ను శనివారం పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ‍్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు స్మిత్‌.  2011లో బిగ్‌ బాష్‌ క్రికెట్‌ లీగ్‌ సందర్భంగా డానీని కలిసిన స్మిత్‌ 2017లో న్యూయార్క్‌లోని రాక్‌ఫెల్లర్‌ సెంటర్‌ భవనంపై పెళ్లి ప్రస్తావన చేశాడు. అప్పటికి లా విద్యార్థిని అయిన డానీ.. స్మిత్‌ ప్రేమను అంగీకరించింది.  అప్పట్నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

‘ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజు. నా ప్రియురాలిని జీవిత భాగస్వామిని చేసుకున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’ అని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొన్న స్మిత్‌.. ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top