నేనెక్కడున్నానో చెప్పుకోండి: భారత కెప్టెన్ | spot me in the phots posts virat kohli | Sakshi
Sakshi News home page

నేనెక్కడున్నానో చెప్పుకోండి: భారత కెప్టెన్

Jan 12 2017 4:33 PM | Updated on Sep 5 2017 1:06 AM

నేనెక్కడున్నానో చెప్పుకోండి: భారత కెప్టెన్

నేనెక్కడున్నానో చెప్పుకోండి: భారత కెప్టెన్

దూకుడే మంత్రంగా చెలరేగిపోయే ఆటగాడు విరాట్ కోహ్లీ.

దూకుడే మంత్రంగా చెలరేగిపోయే ఆటగాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం కోహ్లీ టెస్టు కెప్టెన్సీతో పాటు వన్డే, టి-20 ఫార్మాట్లలోనూ సారథ్యం వహించనున్నాడు. వన్డే, టి-20 కెప్టెన్‌ ధోనీ గతవారం అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీ వారసుడిగా కోహ్లీ జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించడంతో ఒక్కసారిగా తన పాత రోజులను నెమరు వేసుకుంటున్నాడు.

కోచ్ చెప్పే సూచనలు తీక్షణంగా వింటున్న కోహ్లీ కిందే మిగతా ఆటగాళ్లతో కలిసి కూర్చొన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అంతేనా తానెక్కడున్నాడో చెప్పగలరా అంటూ..తన అభిమానులకు సవాలు కూడా విసిరాడు. పాత రోజులు చాలా మధురమైనవి అంటూ కామెంట్ పెట్టాడు. ఇంతకీ కోహ్లీ ఎక్కడున్నాడో మీరు గుర్తుపట్టారా? అదేనండి ముందు వరుసలో ఎడమవైపు చివరకు కూర్చొన్న యువకుడే మన భారత జట్టు రథసారధి.
    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement