దక్షిణాఫ్రికా బోణి | south africa beats Afghanistan by 37 runs | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా బోణి

Mar 20 2016 6:27 PM | Updated on Sep 3 2017 8:12 PM

దక్షిణాఫ్రికా బోణి

దక్షిణాఫ్రికా బోణి

వరల్డ్ టీ 20లో భాగంగా ఆదివారం అఫ్ఘానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 37 పరుగుల తేడాతో గెలిచింది.

ముంబై: వరల్డ్ టీ 20లో భాగంగా ఆదివారం అఫ్ఘానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 37 పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా సమష్టిగా రాణించడంతో టోర్నీలో బోణి కొట్టింది.  దక్షిణాఫ్రికా విసిరిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్ఘాన్లు పోరాడి ఓటమి చెందారు. చివరి వరకూ తమ పోరాటం కొనసాగించిన అఫ్ఘానిస్తాన్ 172 పరుగులకు చేసి పరాజయం చెందింది. అఫ్ఘాన్ ఆటగాళ్లలో మొహ్మద్ షహజాద్(44; 19 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు) పరుగుల మోత మోగించి దక్షిణాఫ్రికా గుండెల్లో గుబులు పుట్టించాడు. షహజాద్ దూకుడుతో అఫ్ఘాన్ నాలుగు ఓవర్లలోనే యాభైకి పరుగులు సాధించి ఊపు మీద కనిపించింది. కాగా, ఆ తరువాత నూర్ అలీ జాద్రాన్(25), గుల్బాదిన్(26), షెన్వారీ(25)లు మాత్రమే మోస్తరుగా రాణించడంతో అఫ్ఘాన్కు ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు సాధించగా, అబాట్, ఇమ్రాన్ తాహీర్లకు తలో రెండు వికెట్లు దక్కాయి.


అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 209 పరుగులు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వీరవిహారం చేశాడు. డివిలియర్స్ (64; 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తన సహజసిద్ధమైన ఆటతో విరుచుకుపడ్డాడు.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నదక్షిణాఫ్రికాకు ఓపెనర్ హషీమ్ ఆమ్లా(5) నిరాశపరిచినా, మరో ఓపెనర్ డీ కాక్(45; 31 బంతుల్లో  6 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడాడు.

 

అనంతరం కెప్టెన్ డు ప్లెసిస్(41; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అతనికి సాయంగా డివిలియర్స్ కూడా రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు వేగంగా కదిలింది. అఫ్ఘాన్ స్పిన్నర్ రషిద్ వేసిన ఇన్నింగ్స్ 17.0 ఓవర్లో డివిలియర్స్  29 పరుగులు సాధించాడు. తొలి బంతిని సిక్సర్గా మలచిన డివిలియర్స్, రెండో బంతికి ఫోర్ సాధించాడు. ఆ తరువాత మూడు బంతులను వరుస సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలోనే  దాదాపు 200 పైగా స్ట్రైక్ రేట్ తో డివిలియర్స్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక చివరి బంతికి సింగిల్ తీయడంతో మొత్తంగా ఆ ఓవర్లో 29 పరుగులను డివిలియర్స్ పిండుకున్నాడు. ఇక చివర్లో డేవిడ్ మిల్లర్(19; 8 బంతుల్లో  2 ఫోర్లు, 1 సిక్స్), జేపీ డుమినీ(29 నాటౌట్; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్)లు అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపెట్టడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement