వెటెల్‌కు మళ్లీ ‘పోల్’ | Sebastian Vettel on pole for Brazilian Grand Prix | Sakshi
Sakshi News home page

వెటెల్‌కు మళ్లీ ‘పోల్’

Nov 24 2013 1:21 AM | Updated on Sep 2 2017 12:54 AM

వెటెల్‌కు మళ్లీ ‘పోల్’

వెటెల్‌కు మళ్లీ ‘పోల్’

డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమైనప్పటికీ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడు.

సావోపాలో: డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమైనప్పటికీ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లోని చివరిదైన 19వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిని ఈ జర్మనీ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో వెటెల్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 26.479 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు.
 
  ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును వెటెల్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. ఈ సీజన్‌లో వెటెల్‌కిది తొమ్మిదో ‘పోల్’ కాగా... కెరీర్‌లో 45వది కావడం విశేషం. ఈ సీజన్‌లో 12 టైటిల్స్ నమోదు చేసిన వెటెల్ ఆదివారం కూడా గెలిస్తే తన ఖాతాలో వరుసగా పదో టైటిల్‌ను జమ చేసుకొని ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement