రోహిత్‌ ఒక్కడే.. ఒక్కడికే!

Rohit Lose His Wicket Same As First Innings - Sakshi

విశాఖ: టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన వరుస రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీల మోత మోగించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న  రోహిత్‌ శర్మ.. ఒక టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన రికార్డును కూడా లిఖించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రపు ఓపెనర్‌గా అత్యధిక పరుగులు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ కెప్లర్‌ వెసెల్స్‌(208) పేరిట ఉండగా దాన్ని రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు సాధిస్తే, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు సాధించి ఔటయ్యాడు.

ఫలితంగా ఓపెనర్‌గా తొలి టెస్టులో 303 పరుగులు సాధించి  రికార్డు లిఖించాడు. అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్‌ శర్మ ఒకే తరహాలో ఔట్‌ కావడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ మహరాజ్‌ బౌలింగ్‌ ముందుకొచ్చి ఆడబోయిన రోహిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అతని బౌలింగ్‌లోనూ ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక్కడ రోహిత్‌ ముందుకొచ్చిన రెండు సందర్భాల్లోనూ వికెట్‌ కీపర్‌ డీకాక్‌ ఎటువంటి తప్పిదం చేయకుండా స్టంప్‌ ఔట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌ ద్వారా రోహిత్‌ పలు ఘనతల్ని సాధించి ఒకే ఒక్కడిగా నిలిస్తే, ఒకే బౌలర్‌కు ఒకే తరహాలో వికెట్‌ సమర్పించుకోవడం గమనార్హం.

దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్‌ ఫోటోలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top